Tirupati: దగ్గరున్న డబ్బు ఇవ్వలేదని.. తిరుపతిలో హత్య!

  • 17న తిరుమలకు వచ్చిన ముగ్గురు తమిళనాడు యువకులు
  • నేర ప్రవృత్తితో వ్యక్తి హత్య
  • వేలిముద్రల సాయంతో పట్టుకున్న పోలీసులు

తిరుపతిలోని బస్టాండ్ వద్ద ఇటీవల జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేవలం రూ. 2,200 కోసం తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారని చెప్పారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కడపజిల్లాకు చెందిన మాధవరెడ్డి, తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని చూసేందుకు 18న వచ్చి అదృశ్యమయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, 20న భారతీ బస్టాండ్ సమీపంలో అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వేలిముద్రల సాయంతో హత్యకు పాల్పడిన వారు తమిళనాడు, కాంచీపురానికి చెందిన ధరణీధరన్‌ (20), కే రాజ్‌కుమార్‌ (24), డీ శక్తి (20) లని తేల్చి, వారిని అరెస్ట్ చేసి తీసుకు వచ్చారు. 17వ తేదీన తిరుమలకు వచ్చిన వీరు కొండపైకి వెళ్లి, దర్శనం చేసుకుని వచ్చారని, ఆపై తమలోని నేరప్రవృత్తితో ఎవరినైనా అడ్డగించి డబ్బు కాజేయాలని భావించారని, వారికి మాధవరెడ్డి కనిపించాడని చెప్పారు. డబ్బులను డిమాండ్ చేయగా, ఇచ్చేందుకు మాధవరెడ్డి అంగీకరించకపోవడంతో, కత్తితో గొంతుకోసి హతమార్చి, అతని జేబులో ఉన్న రూ. 2,200 పట్టుకెళ్లారని తెలిపారు. వీరు గతంలో తక్కువ మొత్తాల కోసం ఎన్నో కిరాతకాలను చేశారని, వీరిపై పలు కేసులు, రౌడీ షీట్లు కూడా తెరిచారని చెప్పారు.

  • Loading...

More Telugu News