Police: సోఫియాన్‌లో మరోమారు రెచ్చిపోయిన ఉగ్రవాదులు!

  • కశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రవాదుల అరాచకాలు
  • పోలీస్ స్టేషన్‌పై దాడి
  • గ్రనేడ్లు, కాల్పులతో బీభత్సం

దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్‌లో ఆదివారం ఉదయం ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. సర్దార్ పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జవూరా గ్రామానికి చెందిన పోలీసు కానిస్టేబుల్ సాఖిద్ మొహియుద్దీన్ ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ స్టేషన్ మెయిన్ గేటు వద్ద ఉన్న సాఖిద్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. తొలుత గ్రనేడ్లు విసిరిన ఉగ్రవాదులు అనంతరం కాల్పులు జరిపారు. దీంతో అదనపు  బలగాలు అక్కడికి చేరుకోవడంతో ఉగ్రవాదులు పరారయ్యారు. వారి కోసం వేట ప్రారంభమైనట్టు పోలీసులు తెలిపారు.

Police
kill
Jammu And Kashmir
Shopian
police station
  • Error fetching data: Network response was not ok

More Telugu News