Tirumala: టీటీడీలో లైంగిక వేధింపులు... రోడ్డెక్కిన మహిళా ఉద్యోగులు!

  • విష్ణునివాసం అధికారులు వేధిస్తున్నారు
  • పడగ్గదిలోకి వెళ్లకుంటే పని చేయడం లేదని ఆరోపణలు
  • విచారణకు హామీ ఇచ్చిన ఉన్నతాధికారులు

తిరుమల తిరుపతి దేవస్థానంలోని పురుష అధికారులు, తమను నిత్యమూ లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ, వందలాది మంది మహిళా ఉద్యోగులు రోడ్డెక్కారు. విష్ణునివాసంలో పనిచేస్తున్న అధికారులు కొందరు, అధికార పార్టీ అండతో తమను వేధిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. విధులకు హాజరవుతున్న తమను, పడగ్గదుల్లోకి రావాలని అడుగుతున్నారని, తాము కాదంటే, సరిగ్గా పని చేయడం లేదంటూ విరుచుకుపడుతున్నారని పలువురు మహిళలు ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళలు తమ ఆందోళన విరమించారు.

Tirumala
Tirupati
TTD
Vishnu Nivasam
Harrasment
  • Loading...

More Telugu News