Congress: ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైంది.. ప్రజల నుంచి దూరం జరిగింది: మోదీ

  • ప్రభుత్వాన్ని విమర్శించడమే కాంగ్రెస్ ఏకైక అజెండా
  • ప్రజలను తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకుంది
  • కాంగ్రెస్ కుయుక్తులను తిప్పికొట్టండి

ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. ప్రజలతోనూ ఆ పార్టీకి సంబంధాలు తెగిపోయాయన్నారు. బీజేపీ బూత్ లెవల్ కార్యకర్తలతో జరిగిన సమావేశం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాంగ్రెస్ ఏకైక అజెండా అని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా ప్రజలతో కాంగ్రెస్ తన సంబంధాలను పూర్తిగా తెంచేసుకుందని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరోపణలు తిప్పికొట్టేలా పనిచేయాలని కార్యకర్తలకు ప్రధాని పిలుపునిచ్చారు. వివిధ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వీలైనంత ఎక్కువమంది ప్రజలను కలిసి కాంగ్రెస్ కుయుక్తులను వివరించాలని సూచించారు.

పెద్ద నోట్ల రద్దుపై మోదీ మాట్లాడుతూ.. ఈ చర్య వల్ల ప్రాపర్టీ మార్కెట్‌లో నల్లధనం లేకుండా పోయిందన్నారు. ప్రాపర్టీ రంగంలో ధరలు కూడా తగ్గాయన్నారు. యూపీఏ హయాంతో పోలిస్తే గృహ రుణాల వడ్డీ రేట్లు కూడా పది శాతానికి మించి తగ్గాయని వివరించారు. మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వం ఎంతో చేస్తోందని మోదీ వివరించారు.

  • Loading...

More Telugu News