Karnataka: తల్లిని తిట్టాడని... స్నేహితుడిని చంపి, తలతో పోలీసు స్టేషనుకు!

  • చిన్ననాటి స్నేహితుడి తల నరికిన పశుపతి
  • ఆపై 24 కిలోమీటర్ల దూరంలోని స్టేషన్ కు
  • కర్ణాటకలోని మాండ్యా సమీపంలో ఘటన

తన ప్రియురాలి తలను నరికి, దాన్ని చేతిలో పట్టుకుని, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఉన్మాద ప్రియుడి ఘటనను మరువకముందే, అటువంటిదే మరో ఘటన జరిగింది. తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించాడన్న కోపంతో, ఓ వ్యక్తి తన మిత్రుడి తలను తెగనరికి, దాన్ని చేత్తో పట్టుకుని పోలీసు స్టేషన్‌ కు వచ్చి లొంగిపోయిన ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని చిక్కబాగిలులో తీవ్ర కలకలం రేపింది.

 పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల మేరకు, ఈ కేసు నిందితుడు పశుపతి, మృతి చెందిన గిరీశ్‌ చిన్ననాటి నుంచి స్నేహితులు. కొద్దిరోజుల కిందట గిరీశ్‌, ఓ విషయంలో పశుపతి తల్లిని దూషించాడు. నాటి నుంచి మనసులో పగను పెంచుకున్న పశుపతి, నిన్న ఉదయం మాట్లాడాల్సి వుందని చెప్పి, గిరీశ్‌ ను ఊరిబయటకు తీసుకెళ్లాడు. ఆపై తాను ముందుగా తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి చంపాడు. తర్వాత మొండెం నుంచి తలను వేరు చేసి, దానిని తీసుకుని, ఘటనా స్థలికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న మళవళ్లి పోలీసు స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. అతన్ని చూసి అవాక్కైన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

Karnataka
Murder
Police
Head
  • Loading...

More Telugu News