Telangana: ఇన్ని రోజులూ కనపడకపోవడానికి కారణమిదే!: విజయశాంతి

  • ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆరోగ్యంపై అశ్రద్ధ
  • ఫలితంగా కొన్ని శస్త్రచికిత్సలు
  • తిరిగి ఫిట్ కావడానికి సమయం పట్టిందన్న విజయశాంతి

కేసీఆర్ కన్నా ఉద్యమంలో తానే సీనియర్ నని, తాను తల్లి తెలంగాణ పార్టీని 1998లో స్థాపించి, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న వేళ, కేసీఆర్ అధికారాన్ని అనుభవిస్తున్నారని కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, తాను ఇన్ని రోజులూ ప్రత్యక్ష రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉన్నానన్న విషయాన్ని కూడా వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా, తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని, దీంతో కొన్ని సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చిందని అన్నారు. బలహీనపడ్డ తాను తిరిగి ఫిట్ అవ్వడానికి కొంత సమయం పట్టిందని తెలిపారు. ప్రజలంతా ఒకే దిక్కు నిలబడి, కేసీఆర్ ను ఐదేళ్ల పాటు అధికారంలో ఉండాలని గెలిపిస్తే, నాలుగేళ్లకే ఆయన పారిపోయారని విజయశాంతి ఎద్దేవా చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి, కాంగ్రెస్ ను గెలిపించడం ద్వారా బహుమతిని ఇస్తానని అన్నారు.

Telangana
Vijayasanti
KCR
Elections
  • Loading...

More Telugu News