బిగ్ బాస్ సీజన్ -2 విన్నర్ కౌశల్, రన్నరప్ గీతామాధురి?
- నేటితో ముగియనున్న బిగ్ బాస్-2
- గెలిచింది కౌశలేనంటున్న సోషల్ మీడియా
- మరికొన్ని గంటల్లో తెలియనున్న వాస్తవం
ప్రేక్షకుల నుంచి అపూర్వ మద్దతు పొందిన కౌశల్ టైటిల్ సొంతం చేసుకున్నాడని, ప్రచారం జరుగుతోంది. రన్నరప్ గా గీతామాధురి నిలిచిందని చెబుతున్నారు. ఇక, నేడు ప్రసారం అయ్యే గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. నాని పక్కన నిలబడి కౌశల్ మాట్లాడుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక, అసలు విజేత ఎవరు? అన్న విషయం తెలియాలంటే, మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.