Indonesia: ఇండొనేషియాలో పెను విషాదం నింపిన సునామీ... 400 మంది మృతి, వందలాది మంది గల్లంతు!

  • శుక్రవారం సంభవించిన భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రత
  • ఆ వెంటనే విరుచుకుపడిన సునామీ

ఇండొనేషియాలో శుక్రవారం నాడు సంభవించిన 7.5 తీవ్రతతో కూడిన భూకంపం తరువాత ఏర్పడిన సునామీ, తీర ప్రాంతాలపై విరుచుకుపడింది. 20 అడుగుల ఎత్తులో సునామీ అలలు తీరాన్ని తాకగా, పలు ప్రాంతాలు నీటమునిగాయి. అలల ధాటికి దాదాపు 400 మందికిపైగా మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మరో 500 మందికిపైగా గాయాల పాలయ్యారని అధికారులు వెల్లడించారు. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఇప్పటికే వందలాది మంది ఆచూకీ తెలియరావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. రాకాసి అలలు దూసుకు రావడంతో ఎటూ పోలేని స్థితిలో తీర ప్రాంతంలోని ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. దేశానికి ఈ సునామీ భారీ ఆస్తి, ప్రాణనష్టాన్ని మిగిల్చింది. వేలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. సహాయక చర్యల కోసం సైన్యాన్ని రంగంలోకి దింపామని దేశ అధ్యక్షుడు జోకో ఫిడోడో తెలిపారు. తమ దేశం మీదుగా వెళుతున్న ఉపగ్రహాలతో ఫొటోలు తీయించి, వాటి ఆధారంగా సహాయక చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News