Nara Lokesh: మోదీకి దత్తపుత్రుడు పవన్.. అవినీతి పుత్రుడు జగన్: లోకేష్

  • జగన్, పవన్ లకు ఓటు వేస్తే.. బీజేపీకి వేసినట్టే
  • వైసీపీ ఒక డ్రామా కంపెనీ
  • ప్రత్యేక హోదా ఎవరిస్తే వారే ప్రధాని అవుతారు

ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతోందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ... మాట తప్పి రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.

 ప్రధాని మోదీకి దత్తపుత్రుడు పవన్ అయితే, అవినీతి పుత్రుడు జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఒక డ్రామా కంపెనీ అంటూ దుయ్యబట్టారు. జగన్, పవన్ లకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఎవరిస్తే వారే ప్రధాని అవుతారని తెలిపారు. రూ. 24 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదని చెప్పారు. తాడేపల్లిగూడెంలో జరిగిన ధర్మ పోరాట దీక్ష సభలో ప్రసంగిస్తూ లోకేష్ ఈమేరకు విమర్శలు గుప్పించారు.

Nara Lokesh
Jagan
Pawan Kalyan
tadepalligudem
modi
  • Loading...

More Telugu News