Pawan Kalyan: పవన్ కల్యాణ్.. అనవసరంగా భయపడవద్దు!: చంద్రబాబు

  • ఫిర్యాదు చేస్తే కావాల్సినంత భద్రతను కల్పిస్తాం
  • సమాచారం ఇవ్వకుండా మాట్లాడితే విమర్శగానే మిగిలిపోతుంది
  • శాంతిభద్రతలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నాం

తనకు ప్రాణాపాయం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై తాడేపల్లిగూడెంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అనవసరంగా భయపడవద్దని పవన్ కు సూచించారు. ఫిర్యాదు చేస్తే పవన్ కల్యాణ్ కు కావాల్సినంత భద్రతను కల్పిస్తామని చెప్పారు.

సమాచారం ఇవ్వకుండా మాట్లాడితే... అది కేవలం విమర్శగానే మిగిలిపోతుందని... దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. శాంతిభద్రతలకు టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇస్తోందని.. రాష్ట్రంలో నీతివంతమైన పాలన కొనసాగుతోందని చెప్పారు.

Pawan Kalyan
Chandrababu
threat
Telugudesam
janasena
  • Loading...

More Telugu News