Casting Couch: క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బాలీవుడ్ నటుడు నానా పటేకర్!

  • హౌస్ ఫుల్-4 షూటింగ్ కు గైర్హాజరు
  • సినిమా యూనిట్ కు సమాచారం ఇవ్వని వైనం
  • తనుశ్రీ దత్తాకు లీగల్ నోటీసులు జారీ

సీనియర్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని హీరోయిన్ తనుశ్రీ దత్తా ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే.ఈ ఆరోపణల నేపథ్యంలో నానా పటేకర్ ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. వెంటనే క్షమాపణలు చెప్పకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత  నానా పటేకర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.

ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న హౌస్ ఫుల్-4 చిత్రంలో అక్షయ్ కుమార్, పూజా హెగ్డే, బాబీ డియోల్ తో కలిసి నానా పటేకర్ నటిస్తున్నారు. అయితే సినిమా యూనిట్ షూటింగ్ కోసం రాజస్తాన్ లోని జైసల్మేర్ కు వెళ్లగా, నానా పటేకర్ మాత్రం షూటింగ్ స్పాట్ కు రాలేదు. ఆయన ఎక్కడికి వెళ్లారో సినిమా యూనిట్ కు కూడా చెప్పలేదని సమాచారం. దీంతో ఆయనపై చిత్రీకరించాల్సిన సీన్లను దర్శకుడు సాజిద్ ఖాన్ వాయిదా వేసుకున్నారు.

2009లో వచ్చిన ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ ‌తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించింది. అయితే ఆమె అబద్ధం చెబుతోందనీ, అప్పుడు షూటింగ్ స్పాట్ లో దాదాపు 100 మంది ఉన్నారని నానా పటేకర్ వెల్లడించారు. కాగా, ఈ వ్యవహారంలో తనుశ్రీ దత్తాకు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రియాంకా చోప్రా, ఫర్హాన్ అక్తర్, ట్వింకిల్ ఖన్నా, సోనమ్ కపూర్ వంటి సెలబ్రిటీలు మద్దతు ప్రకటించారు.

Casting Couch
Bollywood
tanu sri dutta
nana patekar
sexual harrasment
housefull-4
akshay kumar
Salman Khan
Aamir Khan
farhan akthar
  • Loading...

More Telugu News