charan: చరణ్ చేజారిన పాత్రకి విపరీతమైన క్రేజ్!

  • 'నవాబ్'కి మంచి రెస్పాన్స్ 
  • ప్రధాన పాత్రల్లో నలుగురు హీరోలు 
  • శింబు పాత్రకి మరిన్ని మార్కులు  

మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో 'చక్క చివంత వానమ్' సినిమా రూపొందింది. తెలుగులో ఈ సినిమాకి 'నవాబ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేశారు. తమిళనాట ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇది మణిరత్నం మూవీ కావడం .. మల్టీస్టారర్ కావడం అందుకు కారణమని చెబుతున్నారు.

ఈ సినిమాలో నలుగురు హీరోలు ప్రధానమైన పాత్రల్లో కనిపిస్తారు. అందులో ఒక పాత్ర కోసం చరణ్ ను సంప్రదించగా ఆయన నో చెప్పాడు. ఆ పాత్రనే శింబు చేశాడు. 'నవాబ్ ' సినిమాకి మంచి రెస్పాన్స్ రాగా .. శింబు పాత్ర మిగతా పాత్రలకన్నా ఎక్కువగా ప్రభావం చూపుతోందట. ఈ పాత్రను చరణ్ చేసి వుంటే తమిళనాట ఆయన క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగేదని చెప్పుకుంటున్నారు. ఒక విభిన్నమైన పాత్రను ఆయన చేజార్చుకున్నాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.     

  • Loading...

More Telugu News