Harish Rao: క్షేమంగానే ఉన్నా.. మిత్రులెవరూ ఆందోళన చెందవద్దు: హరీశ్ రావు

  • సంగారెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన మంత్రి హరీశ్ రావు
  • మంత్రిని స్వాగతిస్తూ బాణసంచా కాల్చిన టీఆర్ఎస్ శ్రేణులు
  • ఎటువంటి ప్రమాదం జరగలేదని మంత్రి ట్వీట్

ఈరోజు సంగారెడ్డిలో మంత్రి హరీశ్ రావుని స్వాగతిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున బాణసంచాను కాల్చారు. దీంతో మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ వైపు ఒక్కసారిగా పొగలు వ్యాపించి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తనకి ఎటువంటి ప్రమాదం జరగలేదని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్లో తెలిపారు.

 'సంగారెడ్డి ఎన్నికల ప్రచారం ర్యాలీలో నాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. నేను క్షేమంగానే ఉన్నా.. మిత్రులెవరూ ఆందోళన చెందవద్దు.. మీ అభిమానానికి ధన్యవాదాలు' అంటూ మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

Harish Rao
TRS
Sangareddy District
Telangana
  • Loading...

More Telugu News