ntr: 'అరవింద సమేత' ప్రీ రిలీజ్ వేడుకకి వేదిక ఖరారు

  • అక్టోబర్ 2వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • అదే వేదికపై ట్రైలర్ ను రిలీజ్ చేసే ఛాన్స్ 
  • అక్టోబర్ 11వ తేదీన సినిమా విడుదల  

త్రివిక్రమ్ ఈసారి రాయలసీమ నేపథ్యంలో కథను తయారుచేసుకున్నారు. ఈ సినిమాకి 'అరవింద సమేత వీర రాఘవ' అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. ఎన్టీఆర్ రాయలసీమ యాసలో మాట్లాడనుండటం .. ఆయన సిక్స్ ప్యాక్ తో కనిపించనుండటం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ లోగా అక్టోబర్ 2వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఈ వేడుకకి వేదికను ఖరారు చేసుకున్నారు. హైదరాబాద్ .. 'నోవాటెల్' హోటల్లో ఈ వేడుకను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ వేడుకలో .. ఈ వేదికపైనే ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు. తమన్ సంగీతం .. హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెప్పుకుంటున్నారు.     

  • Loading...

More Telugu News