Lakshmi Hebbalkar: బీజేపీలోకి వస్తే రూ.30 కోట్లు.. ఆఫర్ వచ్చిందన్న కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే

  • కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ సంచలన ఆరోపణలు
  • బీజేపీ నేతలు ఫోన్ చేసి రూ.30 కోట్లు ఆఫర్ చేశారన్న మహిళా నేత
  • కర్ణాటకలో దుమారం

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, కేపీసీసీ మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్‌ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నుంచి తనకు బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చిందని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. తమ పార్టీలోకి వస్తే రూ.30 కోట్లు ఇస్తామని బీజేపీ నేతలు తనకు ఫోన్ చేసి ఆహ్వానించారని తెలిపారు. వారు తనతో మాట్లాడిన విషయాలను రికార్డు చేసి పార్టీ నేతలకు చూపించి బీజేపీ నాయకులు చేపట్టిన ‘ఆపరేషన్ కమలం’ గురించి వివరించినట్టు చెప్పారు.

బీజేపీ నేతలు ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలోని సంకీర్ణ సర్కారుకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదన్నారు. కుమారస్వామి ప్రభుత్వం ఐదేళ్లూ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. హెబ్బాళ్కర్ ఆరోపణలతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

Lakshmi Hebbalkar
Karnataka
BJP
Kumara swamy
Congress
  • Loading...

More Telugu News