Pakistan: ఆరు రాత్రులు నేను నిద్రపోలేదంటే ఎవరూ నమ్మరు!: పాక్ కెప్టెన్ సర్ఫ్ రాజ్

  • ఆసియా కప్ నుంచి నిష్క్రమించిన పాక్ జట్టు
  • కెప్టెన్ గా వ్యవహరించడం పెద్ద సవాల్
  • సరిగా ఆడకపోయినా, ఓటమిపాలైనా మరింత ఒత్తిడి  

బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైన పాక్ జట్టు ఆసియా కప్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ సర్ఫ్ రాజ్ అహ్మద్ మాట్లాడుతూ, పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించడం పెద్ద సవాల్ అని, ఈ స్థానంలో ఎవరున్నా ఆ ఒత్తిడి మరింత ఎక్కువవుతుందని చెప్పాడు.

గత ఆరు రాత్రులుగా తాను నిద్రపోలేదంటే ఎవరూ నమ్మరని చెప్పిన సర్ఫ్ రాజు, ఇలా ఒత్తిడి ఎదుర్కోవడం తమకు అలవాటైపోయిందని అన్నాడు. మనం సరిగా ఆడకపోయినా, జట్టు ఓటమిపాలైనా ఒత్తిడి మరింత ఎక్కువవుతుందని చెప్పిన సర్ఫ్ రాజ్, జట్టు ఎంపిక తన చేతిలో ఉండదని అన్నాడు.

Pakistan
asia cup
  • Loading...

More Telugu News