telangana: నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణకు ఎన్నికలు: స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

  • వారం, పది రోజుల్లో తెలంగాణలో ఈసీ పర్యటన
  • అనంతరం ఎన్నికల తేదీలపై తుది కసరత్తు
  • అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణకు కూడా ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాంలతో పాటు తెలంగాణకు ఎన్నికలు జరగనున్నాయి. ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అయింది. ఇటీవల తెలంగాణలో పర్యటించిన ఉమేష్ సిన్హా కమిటీ నివేదికపై చర్చించారు. వారం, పది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటించనుంది. అనంతరం ఎన్నికల తేదీలపై తుది కసరత్తు చేయనుంది. అక్టోబర్ రెండో వారంలో 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. 

telangana
elections
ec
  • Loading...

More Telugu News