lagadapati: మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తున్నారు!: లగడపాటి సర్వేపై పవన్ కల్యాణ్

  • జనసేన ప్రభావం కేవలం నాలుగైదు శాతం మాత్రమే ఉంటుందని చెబుతున్నారు
  • తమ బలం 18 శాతమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి
  • జనసేన కోసం ప్రాణాలనే పెట్టుబడిగా పెట్టా

మాజీ  ఎంపీ లగడపాటిలాంటి వారు తమ సర్వేల్లో జనసేన బలాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. జనసేన ప్రభావం కేవలం నాలుగైదు శాతం మాత్రమే ఉంటుందని అంటున్నారని... కానీ తమ బలం 18 శాతమని, ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పారు.

జనసేన కోసం తన ప్రాణాలనే పెట్టుబడిగా పెట్టానని పవన్ అన్నారు. తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిపోవాలనే ఆశతో తాను రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. బలమైన సిద్ధాంతాలను, విధానాలను తీసుకొస్తామని... పొలిటికల్ క్రిమినల్స్ ను, క్రిమినల్స్ ను తరిమేస్తామని అన్నారు.

సేంద్రీయ వ్యవసాయం తామే చేశామని అమెరికాలో ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా గొప్పగా చెప్పుకున్నారని... కానీ రాష్ట్రంలో దానికి విరుద్ధమైన పరిస్థితి ఉందని జనసేనాని చెప్పారు. చేపల చెరువుల్లోని విషం చెట్లకు పాకుతోందని... ఇలాంటి చోట్ల కొబ్బరిబోండాలు తాగిన వ్యక్తుల కాళ్లు, చేతులు కూడా పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

lagadapati
survey
janasena
Pawan Kalyan
  • Loading...

More Telugu News