Jana Reddy: 5 నిమిషాల్లో తెలంగాణ పోరాటాన్ని అణచివేసేవాళ్లా.. అంత పొగరా?: జానారెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం

  • తెలంగాణ కేసీఆర్ వల్ల రాలేదన్న జానారెడ్డి
  • తలచుకుంటే 5 నిమిషాల్లో అణగదొక్కేవారమని ప్రకటన
  • పాత వీడియోను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రత్యేక తెలంగాణ అన్నది కేసీఆర్ వల్ల రాలేదని గతంలో జనారెడ్డి చెప్పిన వీడియో క్లిప్ ను ట్విట్టర్ లో పంచుకున్న మంత్రి, జానారెడ్డి వ్యవహారశైలిపై మండిపడ్డారు. కేసీఆర్ నేతృత్వంలో గుప్పెడు మంది అటూఇటూ అందోళన చేస్తే తెలంగాణ వచ్చిందా? అది జరగని పని. మేం అనుకుని ఉంటే అప్పుడే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని 5 నిమిషాల్లో అణచివేసి ఉండేవాళ్లం’ అంటూ జానారెడ్డి మీడియాతో మాట్లాడిన క్లిప్ ను మంత్రి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

‘తాము తలచుకుంటే 5 నిమిషాల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్నిఅణచివేసే వాళ్లమని స్కాంగ్రెస్ నేత జానారెడ్డి అంటున్నారు. జానా రెడ్డి వ్యాఖ్యలు ఆయన ఫ్యూడల్ మనస్తత్వానికీ, పొగరుబోతుతనానికి నిదర్శనం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jana Reddy
Telangana
KTR
sepatrate state
fudeal
Congress
5 minutes
  • Error fetching data: Network response was not ok

More Telugu News