Uttam Kumar Reddy: కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • కేసీఆర్ కుటుంబ పాలనకు గోరీ కట్టాలి
  • ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు తగదు
  • అధికారంలోకి రాగానే వడ్డీతో సహా కేసీఆర్ రుణం తీర్చుకుంటాం

కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలంలోని భీమారంలో తెలంగాణ మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు.

‘టీఆర్ఎస్ వైఫల్యాలు-తెలంగాణ ప్రజల ఆకాంక్షలు’ అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో ఉత్తమ్ మాట్లాడుతూ, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే వడ్డీతో సహా కేసీఆర్ రుణం తీర్చుకుంటామని, కేసీఆర్ కుటుంబ పాలనకు గోరీ కట్టాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈవీఎంల పనితీరును కార్యకర్తలు శ్రద్ధగా పరిశీలించాలని, కార్యకర్తల అభీష్టం మేరకే  ‘కాంగ్రెస్’ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెప్పారు.  

Uttam Kumar Reddy
Warangal Rural District
  • Loading...

More Telugu News