nagarjuna: 'దేవదాస్' తొలిరోజు వసూళ్లు

  • నాగ్ .. నాని హీరోలుగా 'దేవదాస్'
  • నిన్ననే ప్రేక్షకుల ముందుకు  
  • వీకెండ్ లో వసూళ్లు పెరిగే అవకాశం     

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని కథానాయకులుగా 'దేవదాస్' సినిమా తెరకెక్కింది. ఆకాంక్ష సింగ్ .. రష్మిక మందన కథానాయికలుగా నటించిన ఈ సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ .. యాక్షన్ .. కామెడీ కలగలిసిన కథ కావడంతో, ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి.

ఈ కారణంగానే తొలిరోజున ఈ సినిమా భారీ వసూళ్లనే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున 4.67 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 6.57 కోట్ల షేర్ ను వసూలు చేసింది. నాగార్జున .. నానికి గల క్రేజ్, కంటెంట్ లోని కొత్తదనం కారణంగా వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా, ఎలాంటి రిజల్ట్ ను రాబడుతుందో చూడాలి.     

  • Loading...

More Telugu News