doraswami raju: అందుకే 'అన్నమయ్య'ను అహోబిలంలో చేశాము: నిర్మాత దొరస్వామి రాజు

  • ఇప్పుడున్న మెట్ల దారిలో చేయలేము 
  • కరెంటు తీగల వంటివి కనిపించకూడదు 
  • దట్టమైన అడవిలో చేయవలసి వచ్చింది

విఎంసి బ్యానర్ నుంచి వచ్చిన ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో ఒకటిగా 'అన్నమయ్య' కనిపిస్తుంది. "ఈ సినిమా షూటింగును తిరుమలకొండలపై చేయడానికి అవాంతరాలు రావడం వల్లనే 'అహోబిలం' లో చేశారట నిజమేనా ?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయనకి ఎదురైంది. అప్పుడు దొరస్వామి రాజు స్పందిస్తూ .. తిరుమల కొండపై షూటింగ్ చేయడానికి అనుమతులు రాలేదు" అన్నారు.

"అంతేకాదు 'అన్నమయ్య' సినిమాను ఇప్పుడున్న మెట్లదారిలో చేయలేము. అలాగే టెలిఫోన్ వైర్లు .. కరెంట్ తీగలు కనిపించకుండా తీయడం కూడా కష్టమవుతుంది. అందువలన దట్టమైన అటవీ ప్రాంతంలోనే ఈ సినిమాను చేయవలసి వుంది. అలాంటి లొకేషన్ల కోసం 'అహోబిలం' వెళ్లడం జరిగింది" అన్నారు. ఇక ఈ మధ్యకాలంలో సినిమాలను నిర్మించడం లేదు .. వయసైపోవడమే ప్రధానమైన కారణం. ఇక ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోవడం మరో కారణం" అని ఆయన చెప్పుకొచ్చారు.      

doraswami raju
nagarjuna
  • Loading...

More Telugu News