Hyderabad: ఈ రియల్ హీరో ఎవరో తెలిస్తే చెప్పండి... సన్మానిస్తాం: హైదరాబాద్ పోలీసులు

  • బుధవారం నాడు అత్తాపూర్ లో దారుణ హత్య
  • హంతకుడిని ఆపేందుకు విఫలయత్నం చేసిన వ్యక్తి
  • అతని గురించి ఆరా తీస్తున్న పోలీసులు

రెండు రోజుల క్రితం, హైదరాబాద్, అత్తాపూర్ ప్రాంతంలో నడిరోడ్డుపై రమేష్ అనే యువకుడిని గొడ్డలితో కిరాతకంగా నరుకుతున్న వేళ, లక్ష్మణ్ గౌడ్ ను నిలువరించేందుకు వెనుకనుంచి బలంగా పట్టుకున్న వ్యక్తి ఎవరన్న విషయమై హైదరాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు. అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి, ఓ హత్యను ఆపేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తి, తన ప్రయత్నంలో విఫలమైనా, అతన్ని పిలిచి, సన్మానించాలని భావిస్తున్న పోలీసులు, అతనెవరో తెలిస్తే చెప్పాలని కోరుతున్నారు.

తొలుత ఆ వ్యక్తి అత్తాపూర్ లో ఉన్న ఓ షోరూం నిర్వాహకుడని భావించి, అక్కడి షాపుల్లో విచారించినా, అతని ఆచూకీ తెలియరాలేదని, అతను రియల్ హీరో అని రాజేంద్రనగర్ సీఐ సురేష్ మీడియాకు తెలిపారు. అతను ఎవరో తెలిస్తే, కమిషనర్ కార్యాలయానికి పిలిపించి, సన్మానిస్తామని అన్నారు.

కాగా, ఈ కేసులో రమేష్ ను కాపాడేందుకు తనవంతుగా తీవ్ర ప్రయత్నం చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తికి సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్ అభినందనలు తెలిపారు. అతనికి క్యాష్ రివార్డు ఇస్తున్నట్టు ప్రకటించారు.

Hyderabad
Attapur
Real Hero
Police
Murder
  • Loading...

More Telugu News