nagarjuna: 'అన్నమయ్య'గా నాగార్జున మీసాలు తీయలేదనే విమర్శలు వచ్చాయి: నిర్మాత దొరస్వామి రాజు

  • మీసాలు తీయనని నాగార్జున అనలేదు
  • అప్పట్లో ప్రెస్ వాళ్లు అడిగారు 
  • దానికి నేను సమాధానం చెప్పాను    

దొరస్వామిరాజు నిర్మించిన చెప్పుకోదగిన చిత్రాలలో 'అన్నమయ్య' ఒకటి. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. అలాంటి ఈ సినిమా గురించిన ప్రస్తావన ఐ డ్రీమ్స్ లో వచ్చింది.

 "అన్నమయ్యకి మీసాలు ఉన్నట్టుగా ఏ ఫొటోల్లోను కనిపించడు .. కానీ ఈ సినిమాలో నాగార్జునకి మీసాలు వున్నాయి. మీసాలు తీయడానికి నాగార్జున ఒప్పుకోలేదనే టాక్ అప్పట్లో వినిపించింది .. దీని గురించి మీరేమంటారు?" అనే ప్రశ్న దొరస్వామిరాజుకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ  .. "అప్పట్లోనే ప్రెస్ వాళ్లు ఈ ప్రశ్న అడిగారు. మీసాలు తీయడానికి నాగార్జున ఒప్పుకోకపోవడమంటూ ఏమీలేదు. అన్నమయ్య 'ఖడ్గం' అంశతో జన్మించినవాడు. పౌరుషానికి .. పరాక్రమానికి ఖడ్గం ప్రతీక. అలాంటి అన్నమయ్య పాత్రకి మీసాలు ఎందుకు ఉండకూడదు? అని ఆ రోజునే నేను అడగడం జరిగింది" అని అన్నారు.    

  • Loading...

More Telugu News