Sabarimala: బ్రేకింగ్... శబరిమలకు మహిళలు వెళ్లవచ్చు: సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు

  • మహిళల భక్తికి అయ్యప్పను దూరం చేయరాదు
  • రుతుస్రావం సాకుగా చూపడం రాజ్యాంగ విరుద్ధం
  • మిగతా అయ్యప్ప ఆలయాలకు లేని ఆంక్షలు శబరిమలలో ఎందుకన్న న్యాయస్థానం!

కేరళలోని పశ్చిమ కనుమల పర్వత సాణువుల్లో, పంబా నదీ తీరంలో కొలువైన అయ్యప్పను దర్శించుకునేందుకు అన్ని వయసుల మహిళలూ వెళ్లవచ్చని సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పును వెలువరించింది. మహిళల భక్తికి అయ్యప్పను దూరం చేయరాదని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఇందూ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. రుతుస్రావం సాకుగా చూపి, మహిళలను దేవుడికి దూరం పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది.

భారత రాజ్యాంగంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉన్నాయన్న విషయాన్ని మరువరాదని, అయితే, భక్తుల మనోభావాల కోణం నుంచి కూడా కేసును పరిశీలించామని, అయితే, భగవంతుడు ఎక్కడున్నా ఒకటే అని చెప్పుకుంటున్న వేళ, మిగతా అయ్యప్ప దేవాలయాల్లో మహిళల ప్రవేశంపై లేని ఆంక్షలు, శబరిమలలో ఉండరాదని పేర్కొంది.

Sabarimala
Ayyappa
Women
Menustral Age
Supreme Court
  • Loading...

More Telugu News