doraswami raju: 'అన్నమయ్య' సినిమా చేయడానికి నాగార్జున భయపడ్డారు: నిర్మాత దొరస్వామి రాజు

  • నాగార్జునతో 'అన్నమయ్య' సినిమా అనుకున్నాం 
  • ఆయన చేయనని చెప్పారు 
  • రాఘవేంద్రరావు ధైర్యం చెప్పి ఒప్పించారు

సినిమా డిస్ట్రిబ్యూటర్ గా .. నిర్మాతగా దొరస్వామిరాజుకి మంచి పేరుంది. వి.ఎం.సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎనో విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "అక్కినేని నాగేశ్వరరావు గారితో 'సీతారామయ్య గారి మనవరాలు' . 'మాధవయ్య గారి మనవడు' సినిమాలు చేశాను.

ఇక నాగార్జునతో 'కిరాయిదాదా' .. 'ప్రెసిడెంట్ గారి అబ్బాయి' .. 'అన్నమయ్య' సినిమాలు తీశాను. 'అన్నమయ్య' సినిమా నాగార్జునను మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే అసలు ఈ సినిమా చేయడానికి నాగార్జున భయపడ్డారు. అప్పుడు నాగార్జున దగ్గరికి రాఘవేంద్రరావు వెళ్లి, 'బాబూ, నీ కెరియర్లో ఇదో మంచి సినిమా అవుతుంది .. నీతో నేను చేయిస్తాను గదా' అని ధైర్యం చెప్పి ఒప్పించారు. అలా ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లింది .. అనూహ్యమైన విజయాన్ని అందుకుంది"అని చెప్పుకొచ్చారు.   

  • Loading...

More Telugu News