Hyderabad: జీన్స్, షర్ట్, ఒళ్ళంతా బురద... హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుపై స్పృహలేని స్థితిలో యువతి!

  • ఔటర్ రింగ్ రోడ్డుపై 23 ఏళ్ల యువతి
  • చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
  • ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాల్లో పోలీసులు

ఓ యువతి... బహుశా వయసు 23 సంవత్సరాలు ఉండవచ్చు. హైదరాబాద్ నగర శివార్లలోని కీసర - రాంపల్లిదాయర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్లాట్ ఫాంపై స్పృహ కోల్పోయి పడివుంది. ఈమెను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు, యువతి ఆచూకీ తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించారు.

బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, వైట్ కలర్ షర్ట్ ధరించిన ఈ యువతి ఔటర్ రింగ్ రోడ్డుకు ఎందుకు వచ్చింది? ఎవరితో వచ్చింది? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నగరంలో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా? అని పరిశీలిస్తున్నారు. వైద్య చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించామని తెలిపారు. 

Hyderabad
Outer Ring Road
Lady
Unconsious
Police
  • Loading...

More Telugu News