Andhra Pradesh: ముగిసిన విదేశీ పర్యటన.. విజయవాడ చేరుకున్న చంద్రబాబు

  • ఐరాసలో ప్రసంగించేందుకు వెళ్లిన చంద్రబాబు
  • ప్రవాసాంధ్రులతో సమావేశం
  • గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం

ఐక్యరాజ్య సమితి ఆహ్వానంపై అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర తదితరులు ఘన స్వాగతం పలికారు.

ఐక్యరాజ్య సమితిలో ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించేందుకు అమెరికా వెళ్లిన చంద్రబాబుకు అక్కడ ఘన స్వాగతం లభించింది. అక్కడ ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలోనూ చంద్రబాబు మాట్లాడారు. అలాగే, పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు.

Andhra Pradesh
Chandrababu
Vijayawada
Gannavaram
  • Loading...

More Telugu News