YSRCP: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వైసీపీ నేత కోలా గురువులు ఆడియో టేప్!

  • ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసే వారికే టికెట్లు
  • మనం ఎంత చెప్పినా పెంచుకుంటూ పోతాడు  
  • వైసీపీ నేత కోలా గురువులు ఆవేదన

వైసీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త కోలా గురువులు ఇటీవల తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో  జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన అనుచరుల్లో ఎవరో దీనిని రికార్డు చేసి వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశారు.

హార్బర్‌లో ఇటీవల తన అనుచరులతో సమావేశమైన గురువులు జగన్ తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎంత ఖర్చు పెడతానో ముందే చెప్పడం కాకుండా, ఆ మొత్తాన్ని వారి చేతిలో పెడితేనే టికెట్ ఇచ్చారని గురువులు వారితో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఎంత ఖర్చు పెడతావని అడిగితే.. రెండు హ్యాచరీలు అమ్మేసి ఎంతో కొంత ఖర్చు చేస్తానని చెప్పానని ఆయన పేర్కొన్నారు.

లేదంటే రూ.10 కోట్ల వరకు ఖర్చు పెట్టగలనని చెప్పానని అనుచరులకు తెలిపారు. పది సరిపోదని, ఇంకా.. అని అంటే రూ.15 కోట్లని చెప్పానని వివరించారు. మనం ఒకవేళ రూ.15 కోట్లంటే రూ.20 అంటారని గురువులు పేర్కొన్నారు. మనం ఎంత చెప్పినా దానికి అలా పెంచుకుంటూ పోతాడని ఆ సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడీ వీడియో వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది.

గురువులు పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇటీవల గురువులను తప్పించి ఆయన స్థానంలో వేరొకరిని పార్టీ సమన్వయకర్తగా జగన్ నియమించారు.

YSRCP
Jagan
Kola Guruvulu
Visakhapatnam District
Andhra Pradesh
  • Loading...

More Telugu News