nanapatekar: ఆ అమ్మాయి నాపై లేనిపోని ఆరోపణలు చేస్తోంది: నానాపటేకర్

  • సెట్ లో నాతో పాటు మరో వంద మంది ఉన్నారు
  • చట్టపరంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నా
  • నేనేమి మాట్లాడినా మీడియా ఏవేవో రాసేస్తుంది!

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ గతంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని నటి తనుశ్రీ దత్తా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో నానాపటేకర్ స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘ఆ అమ్మాయి నాపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటే నన్ను ఏం చేయమంటారు? సినిమా చిత్రీకరణ సమయంలో నాతో పాటు మరో వంద మంది ఉన్నారు. ఈ విషయం గురించి నేను ఎంత మాట్లాడినా వృథానే.. నాపై ఆమె చేసిన ఆరోపణలకు చట్టపరంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నా. నేను ఏం మాట్లాడినా మీ మీడియా వర్గాలు ఏవేవో రాసేస్తాయి’ అన్నారు.

కాగా, 2009లో వచ్చిన ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్ లో నానాపటేకర్ తనపై అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ దత్తా ఆరోపించింది. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన గణేశ్ ఆచార్య స్పందిస్తూ, నానా పటేకర్ పై తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ సెట్ లో తాను కూడా ఉన్నానని, నానా పటేకర్ ఇచ్చిన సలహాలను తనుశ్రీ తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై తనుశ్రీ దత్తా స్పందిస్తూ, అతను పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడింది.

nanapatekar
tanu sri datta
  • Loading...

More Telugu News