Revanth Reddy: రేవంత్ ఇళ్లపై ఐటీ దాడులు చేయించాల్సినంత కర్మ బీజేపీకి పట్టలేదు: కిషన్ రెడ్డి

  • కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణలను ఖండిస్తున్నా
  • ఐటీ దాడులు ఎలా చేస్తారో కాంగ్రెస్ నేతలకు తెలియదా?
  • పొంగులేటి ఇంటిపై ఐటీ దాడులూ మేమే చేయించాం?

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ అధికారుల సోదాలు చేయడానికి కారణం బీజేపీయేనని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై టీ-బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని అన్నారు.

ఐటీ దాడులు ఎలా చేస్తారో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు తెలియదా? అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులతో దాడులు చేయించే అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదని, ఆయన ఇళ్లపై దాడులు చేస్తే బీజేపీకి వచ్చే లాభనష్టాలేమీ లేవని అన్నారు. అసలు అంత కర్మ బీజేపీకి పట్టలేదని అన్నారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై కూడా ఐటీ దాడులు చేయించింది బీజేపీయేనని అంటారా? అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు.

Revanth Reddy
kishanreddy
  • Loading...

More Telugu News