Supreme Court: ‘లవ్ యాత్రి’కి బెదిరింపులు.. సుప్రీంకోర్టుకు సల్మాన్!

  • సల్మాన్ నిర్మాణంలో తెరకెక్కిన ‘లవ్ యాత్రి’
  • టైటిల్ మార్చాలని డిమాండ్
  • అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'లవ్ యాత్రి'. తన బావ ఆయుష్ శర్మ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని సల్మాన్ నిర్మించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తలెత్తిన ప్రేమకథాంశంతో ఈ సినిమా రూపొందింది. తొలుత ఈ సినిమాకు ‘లవ్ రాత్రి’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. అయితే, పలు హిందూ సంఘాలు పవిత్రమైన నవరాత్రి ఉత్సవాలను కించపరిచే విధంగా టైటిల్‌ ఉందంటూ ఆందోళనలు చేశారు. టైటిల్ మార్చాలని డిమాండ్ చేయడంతో సల్మాన్ చివరకు ‘లవ్ యాత్రి’గా మార్చారు.

అయినా హిందూ సంఘాలు శాంతించలేదు. సల్మాన్‌పై బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాయట. దీంతో గురువారం సల్మాన్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా ఈ కేసును పరిశీలించేందుకు అంగీకరించారు. అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Supreme Court
love yatri
aayush sharma
salman khan
deepak misra
  • Loading...

More Telugu News