Donald trump: మేమంతా సరదాగా ఉన్నాం.. కలిసి నవ్వుకున్నాం: ఐరాస 'నవ్వు'లపై ట్రంప్ వివరణ

  • నవ్వారన్న వార్తలను కొట్టిపడేసిన ట్రంప్
  • నన్ను చూసి నవ్వడం కాదు
  • చక్కని సమయం గడిపాం

ఐక్యరాజ్య సమితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తుండగా సభ్యులు పెద్దగా నవ్వారంటూ నిన్న వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలను ఆయన కొట్టిపడేశారు. సభలో తనను చూసి ఎవరూ నవ్వలేదని.. అందరం కలిసి సరదాగా నవ్వుకున్నామని ఆయన తెలిపారు.

ఐరాస సమావేశంలో అమెరికా గత రెండేళ్లలో సాధించిన పురోగతి గురించి ట్రంప్ మాట్లాడుతుండగా సభ్యులు నవ్వారని, ట్రంప్‌కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని బుధవారం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ మీడియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘మేమంతా సరదాగా ఉన్నాం. అది నన్నుచూసి నవ్వడం కాదు. ప్రెసిడెంట్‌ ట్రంప్‌ను చూసి నవ్వారని నకిలీ వార్తలు వచ్చాయి. సభలో మేము చక్కని సమయం గడిపాం. కలిసి నవ్వుకున్నాం' అని ట్రంప్ పేర్కొన్నారు. 

Donald trump
uno
members
media conference
fake news
  • Loading...

More Telugu News