t congress: నేరాల తెలంగాణగా మారింది: దాసోజ్ శ్రవణ్ కుమార్

  • రాష్ట్రంలో పోలీసుల తీరు సిగ్గుపడేలా ఉంది
  • టీఆర్ఎస్ నేతల రక్షణకే పోలీస్ వ్యవస్థ!
  • వచ్చే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనుకోవట్లేదు

రాష్ట్రం బంగారు తెలంగాణగా కాకుండా మర్డర్లు, నేరాల తెలంగాణగా మారిందని, ఇందుకు నిదర్శనం మిర్యాలగూడ, అత్తాపూర్, ఎర్రగడ్డలలో జరిగిన సంఘటనలేనని కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసుల తీరు సిగ్గుపడేలా ఉందని ఆరోపించారు.

కేవలం, టీఆర్ఎస్ నేతల రక్షణకే పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందని, ప్రజల రక్షణలో మాత్రం పోలీస్ వ్యవస్థ విఫలమైందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని టెలీ కాన్ఫరెన్స్ పెట్టే స్థాయికి పోలీస్ వ్యవస్థ దిగజారిందని, కాంగ్రెస్ నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పోలీసుల వైఖరి కారణంగా వచ్చే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం తనకు లేదని శ్రవణ్ కుమార్ అన్నారు.

t congress
dasoj sravan
  • Loading...

More Telugu News