TRS: టీఆర్ఎస్ కు ఓటు వేయండి.. రూ.5 లక్షలతో భవనం కట్టిస్తా!: తాజా మాజీ ఎమ్మెల్యే ఆఫర్

  • కామారెడ్డిలో పర్యటించిన రవీందర్ రెడ్డి
  • టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి
  • ఐదు లక్షలతో భవనం ఎలా సాధ్యమని నిలదీత 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి ఇబ్బందుల్లో పడ్డారు. ఓ భవన నిర్మాణానికి సాయం చేయాలంటే అందరూ కలిసి టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటేస్తామని తీర్మానం చేయాలని సూచించారు. తాను చెప్పినట్లు చేస్తే రూ.5 లక్షలు ఇస్తానని ఆఫర్ కూడా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రవీందర్ రెడ్డి నిన్న సదాశివనగర్ మండలం, మర్కల్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను ఆయనకు ఏకరవు పెట్టారు. కొందరు మహిళలు తమ పొదుపు సంఘాల సమావేశం కోసం ఓ భవనం కావాలని కోరారు. దీంతో ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే.. భవన నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించారు. స్థానికంగా ఉన్న 50 పొదుపు సంఘాల్లోని మహిళలు టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటేస్తామని తీర్మానం చేయాలన్నారు.

దీంతో పలువురు మహిళలు రూ.5 లక్షలతో భవన నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇంతలో అక్కడే ఉన్న రవీందర్ రెడ్డి అనుచరులు.. అది తొలి విడత సొమ్మని సర్దిచెప్పారు. అధికార పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఇంకా నిధులు విడుదల చేస్తామని బుజ్జగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

TRS
mla
Kamareddy District
RS.5lakh
self help group
  • Error fetching data: Network response was not ok

More Telugu News