challa dharma reddy: దమ్ము, ధైర్యం ఉంటే నాపై పోటీ చేయండి: టీఆర్ఎస్ నేత చల్లా ధర్మారెడ్డి

  • వినాయకచవితికి కొండా దంపతుల వంద తప్పులు పూర్తయ్యాయి
  • రౌడీయిజం, గూండాయిజం చేసే నాయకులు ప్రజలకు అవసరం లేదు
  • ఊరికొక కొండా మురళి ఎందుకు?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో గెలిచే సత్తా ఉందని కొండా దంపతులు చెప్పుకుంటున్నారని... వారికి దమ్ము, ధైర్యం ఉంటే పరకాల నియోజకవర్గంలో తనపై పోటీ చేసి, గెలవాలని తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్ విసిరారు. వినాయకచవితికి కొండా దంపతుల వంద తప్పులు పూర్తయ్యాయని అన్నారు.

రౌడీయిజం, గూండాయిజం చేసేవాళ్లు, కాళ్లు మొక్కించుకునే నాయకులు ప్రజలకు అవసరం లేదని తెలిపారు. గతంలో ఒక సమావేశంలో ఊరికో కొండా మురళి పుట్టాలని ఆయన కూతురు చెప్పారని... ఒక్క కొండా మురళితోనే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే... ఊరికొకరు ఎందుకని ఎద్దేవా చేశారు. గీసుకొండ మండలం కొనాయమాకులలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

challa dharma reddy
Konda Surekha
konda surekha
parakala
TRS
congress
  • Loading...

More Telugu News