Revanth Reddy: వికారాబాద్ జిల్లా బొంరాస్ పేటలో రేవంత్ రెడ్డి... దాడులను తేలికగా తీసుకున్న కాంగ్రెస్ నేత!

  • దాడులను తేలికగా తీసుకున్న రేవంత్ రెడ్డి
  • మదన్ పల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభం
  • రేవంత్ కు స్వాగతం పలికిన అభిమానులు

ఓ వైపు తన ఇల్లు, తన బంధువుల ఇళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరుపుకున్న వేళ, తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కగా, దీన్నేమీ పట్టించుకోని రేవంత్ తన పనిలో తానున్నారు. ఈ దాడులను తేలికగా పరిగణిస్తున్న ఆయన, ఈ ఉదయం వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం మదన్ పల్లిలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

తమ గ్రామానికి వచ్చిన రేవంత్ కు ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికాయి. ఈడీ సోదాలపై ఏ మాత్రం ఆందోళన లేకుండా రేవంత్ కనిపించినట్టు తెలుస్తోంది. ఆయన ప్రచారం, మదన్ పల్లి నుంచి, బురాన్ పూర్, బొంరాస్ పేట మీదుగా మహబూబ్ నగర్ జిల్లా కొస్గి మండలం పోలేపల్లి వరకూ సాగుతుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. 

Revanth Reddy
Election
Campaign
  • Loading...

More Telugu News