Supreme Court: భార్య భర్త సొత్తనడం రాజ్యాంగ విరుద్ధం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  • విశ్వసనీయతతో కూడిన వివాహ వ్యవస్థ మనది 
  • నైతిక విలువలకన్నా, ప్రేమతో కూడిన విలువలకే ప్రాధాన్యం
  • వేరొకరి భాగస్వామితో శృంగారం నేరం కాదన్న సుప్రీం

భారతదేశ వివాహ వ్యవస్థ విశ్వసనీయతతో కూడుకున్నదని, అయితే, పెళ్లి చేసుకున్న తరువాత భార్య భర్త సొత్తనడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ బద్ధత, అడల్ట్రీపై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో విచారణ జరిపిన జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏఎమ్ ఖాన్విల్కర్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన బెంచ్, ఈ సెక్షన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఏకగ్రీవంగా అభిప్రాయపడింది.

వివాహిత పురుషుడు భార్యతో కాకుండా మరొక స్త్రీతో లైంగిక సంబంధం కలిగి వుంటే అది నేరం కాదని చట్టం చెబుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అదే అంశం స్త్రీకి కూడా వర్తిస్తుందని, ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతో జరిగే శృంగారంలో మహిళ బాధితురాలు కాదని, ఇద్దరిదీ సమాన బాధ్యతని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

వివాహం తర్వాత స్త్రీ తన వ్యక్తిత్వం కోల్పోయేలా ఈ చట్టం ఉందని తెలిపింది. చట్టాల పేరిట మహిళల వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లరాదని, వారికి కూడా స్వేచ్ఛ ఉండాల్సిందేనని, సెక్షన్ 497లోని ఎన్నో అంశాలు ఏకపక్షంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. నైతిక విలువలతో పోలిస్తే, ప్రేమతో కూడిన విలువలకే ప్రాధాన్యత ఇస్తూ, ఈ తీర్పును ఇస్తున్నామని, పెళ్లైన వ్యక్తి మరొకరి భార్యతో శృంగారంలో పాల్గొంటూ పట్టుబడితే ఇద్దరూ శిక్షార్హులు కారని ఈ సందర్భంగా సీజే దీపక్ మిశ్రా తెలియజేశారు. 

Supreme Court
Adultry
Section 497
  • Loading...

More Telugu News