Chandrababu: చంద్రబాబును ఎంతో నమ్మా... నా జీవితాన్ని నాశనం చేశారు: మోత్కుపల్లి

  • రాజకీయంగా నన్ను పతనం చేశారు
  • నా జీవితానికి ఇవే చివరి ఎన్నికలు
  • ప్రజల అభీష్టం మేరకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నా

టీడీపీ అధినేత చంద్రబాబును ఎంతగానో నమ్మానని... కానీ, ఆయన తన జీవితాన్ని నాశనం చేశారని ఆ పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా పతనం చేశారని... అయినా, ఆలేరు ప్రజల ఆశీస్సులతో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన జీవితానికి ఇవే చివరి ఎన్నికలని చెప్పారు.

ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాని తెలిపారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలను నిర్వహించానని చెప్పారు. అలేరు ప్రజల అభీష్టం మేరకే ఎన్నికల బరిలోకి దిగుతున్నానని తెలిపారు. రాజకీయ నాయకుడిగా కాకుండా, ప్రజా సేవకుడిగానే ముందుకు వెళ్తున్నానని చెప్పారు. ఈసారి తనను గెలిపిస్తే... ఆలేరుకు గోదావరి జలాలను అందించడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు.

Chandrababu
motkupalli
Telugudesam
  • Loading...

More Telugu News