Adhar: కోర్టు సూచనతో ‘ఆధార్ ఉపసంహరణ’కు అవకాశం!
- అన్నింటికీ ఆధార్ అక్కర్లేదన్న సుప్రీంకోర్టు
- ఇప్పటికే పలు సర్వీస్‌లకు లింక్ అయిన ఆధార్
- డీలింక్ చేయమని కస్టమర్లు కోరే అవకాశం
ఆధార్ ముఖ్యమైన గుర్తింపు కార్డే అయినా అన్నింటికీ దాని అనుసంధానం అక్కర్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ‘ఉపసంహరణ’ జంజాటం తెరపైకి వచ్చింది. ఇప్పటికే పలు బ్యాంక్‌లు, సెల్‌ఫోన్ కంపెనీల వంటి వాటికి తమ ఆధార్ వివరాలు ఇచ్చిన వినియోగదారులు కోట్ల మంది ఉన్నారు. రిలయన్స్ జియో వంటి సంస్థలు కేవలం ఆధార్ ఆధారంగా కనెక్షన్ మంజూరు చేశాయి.
ఇప్పుడు కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో వినియోగదారులు తమ వివరాలను డీలింక్ చేయాలని దరఖాస్తు చేసుకుంటే, ఆయా సంస్థల స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్న. ఇప్పటికే పేటీఎం, ఫోన్ పే వంటి పేమెంట్ వాలెట్ సంస్థలు తమ నిబంధనల నుంచి ఆధార్‌ను తొలగించాయి. మిగిలిన సంస్థలూ వీటిని అనుసరించే అవకాశాలే ఎక్కువ.