jagan: పాదయాత్రలో భాగస్వామిని కావాలనే ఇక్కడకు వచ్చా: ఎస్వీ కృష్ణారెడ్డి

  • ఎస్.కోట మండలంలో జగన్ ను కలిసిన ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి
  • మీ వెంట ఉన్నామంటూ మద్దతు 
  • జగన్ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్న అచ్చిరెడ్డి

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర సందర్భంగా ఎంతో మంది ప్రముఖులు జగన్ కలసి తమ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఎస్.కోట మండలంలో జగన్ ను ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డిలు కలిశారు. మీ వెంట మేము కూడా ఉన్నామంటూ జగన్ కు తమ మద్దతును ప్రకటించారు.

 అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రజల కోసం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను మీడియాలో చూస్తున్నానని... పాదయాత్రలో తాను కూడా భాగస్వామిని కావాలనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చానని చెప్పారు. మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. అచ్చిరెడ్డి మాట్లాడుతూ, జగన్ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఒక గొప్ప సంకల్పంతో జగన్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ప్రజల అండదండలతోనే ఇది సాధ్యమైందని చెప్పారు.

jagan
sv krishna reddy
achireddy
padayatra
YSRCP
  • Loading...

More Telugu News