pawan kalyan: ఎవరో ఎవరి పక్కనో పడుకుంటే.. నేను సమాధానం చెప్పాలా?: పవన్ కల్యాణ్

  • స్టింగ్ ఆపరేషన్ చేయాలనుకుంటే ఈ రౌడీ ఎమ్మెల్యేపై చేయవచ్చు కదా
  • చంపేస్తాడేమో అనే భయం
  • నామీదే ఎందుకు పడుతున్నారో మీడియా సోదరులు చెప్పాలి

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో నిన్న జరిగిన బహిరంగసభలో జనసేన అధినేత వపన్ కల్యాణ్ మీడియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏదైనా స్టింగ్ ఆపరేషన్ చేయాలనుకుంటే ఈ రౌడీ ఎమ్మెల్యేపై చేయవచ్చుకదా? ఈ ఆకు రౌడీ ఎమ్మెల్యేపై చేయవచ్చు కదా? అంటూ పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిని ఉద్దేశించి పవన్ ప్రశ్నించారు.

'అబ్బే.. అలాంటివేమీ చేయరు' అంటూ ఎద్దేవా చేశారు. ఎవరో ఎవరి పక్కనో పడుకుంటే పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలా? అని నిలదీశారు. ఇలాంటి వాటికి పవన్ కల్యాణ్ ఎందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. టీఆర్పీల కోసం ఏవేవో కథనాలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రౌడీ ఎమ్మెల్యేపై ఒక్క వార్త కూడా రాయరని... చంపేస్తాడేమోననే భయం అని చెప్పారు. తన మీదే ఎందుకు పడుతున్నారనే విషయాన్ని మీడియా సోదరులు చెప్పాలని అన్నారు. 

pawan kalyan
janasena
chintamaneni
media
  • Error fetching data: Network response was not ok

More Telugu News