charan: దసరాకి ఫస్టులుక్ తో పలకరించనున్న చరణ్

  • విదేశాల్లో చరణ్ మూవీ షూటింగ్ 
  • మరో రెండు రోజుల్లో తిరుగు ప్రయాణం 
  • సంక్రాంతికి భారీ విడుదల  

బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. కైరా అద్వాని కథానాయికగా చేస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం అజర్బైజాన్ లో షూటింగు జరుపుకుంటోంది. కొన్ని రోజులుగా అక్కడ ప్రధాన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా యూనిట్ హైదరాబాద్ కి తిరిగి రానుంది.

ఈ సినిమాకి 'స్టేట్ రౌడీ' అనే టైటిల్ పరిశీలనలో వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి ఎనౌన్స్ మెంట్ చేయలేదు. విజయదశమి రోజున టైటిల్ తో పాటు ఫస్టులుక్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.  

charan
kiara adwani
  • Loading...

More Telugu News