Falahari Baba: లా విద్యార్థినిపై అత్యాచారం కేసులో ఫలహారీ బాబాకు జీవిత ఖైదు!

  • ఆశ్రమంలోనే లా విద్యార్థినిపై అత్యాచారం
  • గతేడాది సెప్టెంబరులో అరెస్ట్
  • తాజాగా శిక్ష ఖరారు

స్వయం ప్రకటిత ‘గాడ్‌మన్’ ఫలహారీ బాబా స్వామి కౌశలేంద్ర ప్రపన్నాచారికి రాజస్థాన్‌లోని అల్వార్ కోర్టు జీవిత శిక్ష విధించింది. లా విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫలహారీ బాబాను దోషిగా నిర్ధారించిన కోర్టు శిక్షను ఖరారు చేసింది. అల్వార్‌లోని ఆయన ఆశ్రమంలో బాబా తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఏడాది క్రితం బాధిత లా విద్యార్థిని (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గ్రహణం సందర్భంగా తానెవరనీ కలవబోనని, కాబట్టి ఈ రాత్రికి ఇక్కడే ఉండాలని చెప్పిన బాబా తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో 23 సెప్టెంబరు 2017న బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును విచారించిన అల్వార్ కోర్టు ఎట్టకేలకు తుది తీర్పు వెల్లడించింది. బాబాకు జీవిత శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Falahari Baba
Alwar Court
Rajasthan
Swami Kaushlendra Prapannachari
life imprisonment
  • Loading...

More Telugu News