Telangana: మళ్లీ కదిలిన 'ఓటుకు నోటు'... తెలంగాణ ఏసీబీ ఫిర్యాదుతో రేవంత్ పై దాడులు!

  • తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు
  • రూ. 50 లక్షలు ఎక్కడివన్న కోణంలో సోదాలు
  • ఏసీబీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఈడీ

నేటి ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై జరుగుతున్న దాడులు, మూడున్నరేళ్లక్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగానేనని తెలుస్తోంది. అప్పట్లో రేవంత్ రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయమై జరుపుతున్న విచారణలో భాగంగానే దాడులు చేస్తున్నట్టు సమాచారం.

కేసును విచారిస్తున్న తెలంగాణ ఏసీబీ అధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణను కోరగా, రంగంలోకి దిగిన ఈడీ ఏకకాలంలో పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. ఏసీబీ ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై కేసు పెట్టిన ఈడీ, హైదరాబాద్ పోలీసుల సహకారంతో ఈ దాడులు నిర్వహిస్తోంది.

Telangana
ACB
Cash for Vote
Votuku Notu
Revant Reddy
ED
  • Loading...

More Telugu News