Revanth Reddy: బ్రేకింగ్... రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ, ఈడీ అధికారుల మెరుపుదాడి!

  • జూబ్లీహిల్స్, కొడంగల్ ఇళ్లలో సోదాలు  
  • కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్చాఫ్ చేయించిన అధికారులు
  • ముమ్మరంగా కొనసాగుతున్న సోదాలు

ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ మాజీ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ, ఈడీ అధికారులు దాడులకు దిగారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంతో పాటు కొడంగల్ లోని ఆయన నివాసంలోనూ అధికారులు సోదాలు జరుపుతున్నారు. దాడులకు వెళ్లగానే, కుటుంబ సభ్యుల అందరి ఫోన్లనూ అధికారులు స్వాధీనం చేసుకుని స్విచ్చాఫ్ చేసినట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Revanth Reddy
IT
ED
Income Tax
Searching
Congress
Telugudesam
  • Loading...

More Telugu News