Chandrababu: చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టం: కొండ్రు మురళి

  • చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు
  • జగన్‌కు పదవీ వ్యామోహం
  • మోదీ నియంతలా తయారయ్యారు

చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టమని మాజీ మంత్రి కొండ్రు మురళి అన్నారు. శ్రీకాకుళంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పదవీ వ్యామోహం తప్ప ప్రజలపై ప్రేమ లేదని ఎద్దేవా చేశారు. దొంగ యాత్రలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఘోర పరాభవం తప్పదన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ఆయనో నియంతలా తయారయ్యారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో ప్రజలు బీజేపీని నేలకు దించడం ఖాయమన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. చంద్రబాబు లాంటి నేత దొరకడం మన అదృష్టమని మురళి ప్రశంసించారు.  

Chandrababu
Kondru Murali
Jagan
Narendra Modi
  • Loading...

More Telugu News