will smith: 550 అడుగుల ఎత్తు నుంచి దూకుతూ పుట్టినరోజు జరుపుకున్న హాలీవుడ్ నటుడు!

  • అత్యంత ప్రమాదకరంగా 50వ పుట్టినరోజు
  • హెలికాప్టర్ నుంచి బంగీ జంప్యూ 
  • ట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం

చాలామంది సినీ ప్రముఖులు తమ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటూ వుంటారు. కొందరు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి వేడుక చేసుకుంటే.. మరికొందరు కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లి జరుపుకుంటారు. కానీ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ మాత్రం అందరికీ భిన్నంగా అత్యంత సాహసోపేతంగా తన 50వ పుట్టిన రోజును జరుపుకున్నాడు.

ఆరిజోనాలోని గ్రాండ్‌ కేనియన్‌ పర్వత శ్రేణుల్లో అత్యంత ప్రమాదకరమైన రీతిలో బంగీ జంప్‌ చేశాడు. సుమారు 550 అడుగుల ఎత్తులో హెలికాఫ్టర్‌ నుంచి పర్వతాల మధ్య కిందికి దూకుతూ సెలెబ్రేట్ చేసుకోగా... దీన్ని మొత్తం యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అనంతరం స్మిత్ మాట్లాడుతూ 1976లో తొలిసారి తల్లిదండ్రులతో కలిసి గ్రాండ్ కేనియన్ పర్యతాలు చూసేందుకు వచ్చానని తెలిపారు.

will smith
youtube
birthday
helicopter
  • Error fetching data: Network response was not ok

More Telugu News