Maharashtra: ఆయుష్షు గట్టిదే.. కారు పైనుంచి వెళ్లిపోయినా బతికిన పిల్లాడు.. వీడియో వైరల్!

  • మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘటన
  • షూ లేస్ ఊడిపోవడంతో కట్టుకుంటున్న పిల్లాడు
  • చూడకుండానే కారు ఎక్కించేసిన యువతి

అదృష్టం బాగుంటే ఎంతటి ప్రమాదం నుంచి అయినా తప్పించుకోవచ్చు అనడానికి తాజా ఘటనే ఉదాహరణ. ముంబైలో ఓ అపార్ట్ మెంట్ లో పిల్లాడు స్నేహితులతో కలిసి ఫుట్ బాల్ అడుకుంటున్నాడు. అప్పుడే ఓ యువతి పక్కనే పార్క్ చేసిన కారులోకి వెళ్లి కూర్చుంది. ఇంతలో షూలేస్ ఊడిపోవడంతో కారుకు కొద్దిదూరంలో కూర్చున్న పిల్లాడు.. వాటిని కట్టుకోవడం మొదలుపెట్టాడు.

అయితే పిల్లాడిని గమనించని ఓ యువతి, కారును స్టార్ట్ చేసి అతనిపై నుంచి పోనిచ్చింది. దీంతో ఆ బాలుడిని కొద్ది దూరం తోసుకెళ్లిన కారు.. అనంతరం అతనిపై నుంచి వెళ్లిపోయింది. అయితే అదృష్టం కొద్దీ పిల్లాడు కారు మధ్యలోకి జారిపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత బాలుడు లేచి స్నేహితుల దగ్గరకు పరిగెత్తాడు. అక్కడే ఏర్పాటుచేసిన సీసీటీవీల్లో ఈ ఘటన రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News