MS Dhoni: కుల్దీప్ యాదవ్ పై ధోనీ గుస్సా.. నెట్ లో వీడియో వైరల్!

  • ఆఫ్గానిస్తాన్ తో మ్యాచ్ లో ఘటన
  • ఫీల్డింగ్ మార్చాలని కోరిన కుల్దీప్
  • ఘాటుగా జవాబిచ్చిన ధోని

భారత క్రికెట్ జట్టు కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన భావోద్వేగాలను మైదానంలో చూపడు. కానీ అరుదుగా బౌలర్ల, బ్యాట్స్ మెన్ల వ్యవహారశైలితో మహి ఒక్కసారిగా కోపం ప్రదర్శిస్తూ ఉంటాడు. తాజాగా ఆసియా కప్ లో నిన్న ఆఫ్గానిస్తాన్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో ధోని సహనాన్ని కోల్పోయాడు. పదేపదే ఫీల్డింగ్ ను మార్చాలని స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కోరడంపై ఆగ్రహానికి లోనయ్యాడు.

ఆఫ్గానిస్తాన్ తో నిన్న జరిగిన మ్యాచ్ ను భారత్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ సందర్భంగా ఫీల్డింగ్ ను మార్చాలని కోరాడు. దీంతో సహనం కోల్పోయిన మహి.. ‘బౌలింగ్ చేస్తావా.. లేక బౌలర్ నే మార్చమంటావా?’ అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో కుల్దీప్ సైలెంట్ గా బౌలింగ్ చేసేందుకు వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో వికెట్ల వెనుక ఏర్పాటు చేసిన మైక్రోఫోన్ లో రికార్డయింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

MS Dhoni
Cricket
kuldeep yadav
angry
asia cup
  • Error fetching data: Network response was not ok

More Telugu News